
బీహార్.. గూండాయిజానికి మరో పరాకాష్ఠగా నిలిచింది ఈ ఘటన.. ఓ మహిళా కానిస్టేబుల్ పై పెట్రోల్ చల్లి.. నిప్పంటించటానికి ప్రయత్నించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నవంబర్ ఒకటో తేదీన బీహార్ రాష్ట్రం సహర్సా జిల్లాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలోనే మాజీ కౌన్సిలర్, జేడీయూ నేత కుర్నీ అలియాస్ చిన్నా తన అనుచరులతో అటు వైపు వచ్చారు. పోలీసులు వారి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తుండగా గొడవ జరిగింది. పోలీసులపై తిరగబడ్డారు జేడీయూ నేత అనుచరులు. పోలీసులపై దాడికి ప్రయత్నించిన అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై కేసు నమోదు అయ్యింది.
ఈ క్రమంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కుర్నీ గ్యాంగ్ ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందం రంగంలోకి దిగింది. సహర్సా ప్రాంతంలోని ఓ పెట్రోల్ బంకు దగ్గర ఉన్నారన్న విషయం తెలిసి.. పోలీసులు అక్కడికి వెళ్లారు. అరెస్టు చేయటానికి ప్రయత్నించగా.. కుర్నీ గ్యాంగ్ రెచ్చిపోయింది. పెట్రోల్ బంకులోని పెట్రోల్ ను ఓ బకెట్ లో నింపి.. దాన్ని మహిళా కానిస్టేబుల్ పై చల్లారు.. ఆ వెంటనే నిప్పు అంటించు నిప్పు అంటించు అంటూ కుర్నీ గ్యాంగ్ కేకలు వేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో.. అక్కడి నుంచి పోలీసులు తప్పించుకున్నారు. ఇదంతా ఓ పోలీస్ రికార్డ్ చేయటం.. దాన్ని సోషల్ మీడియాలో పెట్టటంలో వైరల్ అయ్యింది.
Also Read :- మోసగాళ్లకే మోసగాడు
బీహార్ లో కుర్నీ గ్యాంగ్ అకృత్యాలు ఎలా ఉన్నాయి అనటానికి ఇదే సాక్ష్యం అంటూ మిగతా పార్టీలు దుమ్మెత్తిపోస్తుంటే.. బీహార్ గూండాయిజం ఏ స్థాయిలో ఉంది అనటానికి ఇదే నిదర్శనం అంటున్నారు నెటిజన్లు. పెట్రోల్ పోసి నిప్పు అంటించేత దారుణమైన ఘటనలు జరగటాన్ని ఖండిస్తున్నారు జనం. ఈ వీడియో ఆధారంగా మరిన్ని కేసులు పెట్టిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
JDU नेता की गुंडई, पुलिसवालों को जिंदा जलाने की कोशिश की.
— Utkarsh Singh (@UtkarshSingh_) November 3, 2023
सहरसा में JDU नेता मोहम्मद ओवैस करनी ने पेट्रोल पम्प से बाल्टी में पेट्रोल निकालकर महिला पुलिसकर्मी पर फेंक आग लगाने की कोशिश की. दरअसल वाहन चेकिंग के दौरान कुछ लोगों ने पुलिसवालों के साथ मारपीट की थी. जिनको गिरफ़्तार… pic.twitter.com/QyrO56CH1r