మోసగాళ్లకే మోసగాడు : కత్తి చూపించి.. దర్జాగా బ్యాంక్ దోపిడీ చేశాడు..

మోసగాళ్లకే మోసగాడు : కత్తి చూపించి.. దర్జాగా బ్యాంక్ దోపిడీ చేశాడు..

బ్యాంక్ దోపిడీ.. ఈ మాట వింటేనే కొంచెం వణుకు పుడుతుంది.. వీడు మాత్రం బెరకు లేకుండా.. ఎంతో దర్జాగా దోపిడీ చేసి వెళ్లిపోయాడు. పెద్ద పెద్ద స్కెచ్ లు ఏమీ వేయలేదు.. జస్ట్ ఓ పెద్ద కత్తి పట్టుకొచ్చాడు.. బ్యాంక్ మేనేజర్ గదిలో కస్టమర్ లా మాట్లాడుతూ.. బ్యాంక్ లో పని ఉంది అన్నట్లు వచ్చాడు.. బ్యాగులోని కత్తిని బయటకు తీశాడు.. బిత్తరపోయి భయపడిన బ్యాంక్ సిబ్బంది కంగారుపడ్డారు.. అంతే టేబుల్ పై ఉన్న డబ్బు బ్యాగులో పెట్టుకుని వెళ్లిపోయాడు.. పట్టపగలు.. మెయిన్ రోడ్డులోని ఓ బ్యాంక్ లో జరిగిన దోపిడీ ఇది.. ఇది ఎక్కడో జరిగింది కాదు.. ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం టౌన్ లో జరిగిన ఇన్సిడెంట్.. పూర్తి వివరాల్లోకి వెళితే...

పట్టపగలు జన సంచారం ఉండే ప్రాంతంలో ఉండే బ్యాంకుకు దర్జాగా వచ్చి రూ.4.50 లక్షలు దోచుకుపోయాడు. నరసాపురం పట్టణంలో బుధ వారం సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటనతో తీర ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టణంలోని జోశ్యుల వారి వీధిలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌ లో ఐదుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. బుధవారం యధావిధిగా బ్యాంకు కార్య కలాపాలు జరుగుతుండగా ఒక వ్యక్తి ముఖానికి మాస్క్‌ ధరించి బ్యాంకులోకి వచ్చాడు. నేరుగా క్యాషియర్‌ దగ్గరకు వెళ్లాడు. మాస్క్‌ ధరించి లోపలికి వచ్చిన అతడిని మేనేజర్‌ దగ్గర ఉన్న మెసెంజర్‌ అభ్యంతరం తెలిపారు. మాస్క్‌ పెట్టుకుని బ్యాంకులోకి ఎందుకు వచ్చావంటూ నిలదీశాడు. మాస్క్‌ తీయాలని కోరాడు.

అయితే తనకు ఆరోగ్యం బాగో లేదని అందువల్లే మాస్క్‌ ధరించి వచ్చానని సమాధానం చెప్పాడు. గోల్డ్‌ లోన్‌ కావాలని అడిగాడు. అయితే బంగారం తనిఖీ చేసే సిబ్బంది లేడని వచ్చేవరకు బయట కూర్చో వాలని సూచించారు. సిబ్బంది నుంచి సమాధానం వచ్చే లోపు చేతిలో ఉన్న సంచి లోంచి పోడుగాటి కత్తిని తీని బెదిరించాడు. అరిస్తే తల తెగుద్దని బెదిరించాడు. ఒక చేత్తో కత్తి చూపిస్తూ మరో
చేతితో టేబుల్‌ మీద ఉన్న నగదును సంచులో వేసుకుని ఉడాయించాడు. గదిలో ఏం జరుగుతుందో బయట సిబ్బందికి తెలిసే లోపు దుండగుడు పరుగెత్తడంతో బయట పనిచేస్తున్న సిబ్బంది అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు.

ఈక్రమంలో ఆతని సంచినుంచి ఒక నోట్లు కట్ట బయట పడింది. విషయం అర్థమై సిబ్బంది బయటకొచ్చి ఆరిచేలోపు అదృశ్యమయ్యాడు. క్షణాల్లో జరిగిన ఈసంఘటన నుంచి నిబ్బంది తేరుకుని వెంటనే పోలీ నులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రసాద్‌ బ్యాంకు వద్దకు చేరుకుని చోరీ జరిగిన విషయంపై 'ఆరా తీశారు. సీనీ పుటేజ్‌లను పరిశీలించి దర్యాష్త చేపట్టారు.

Also Read : ఏసీబీ వలలో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిశ్రమల అధికారి

ఉలిక్కిపడ్డ నరసాపురం
పట్టపగలు జననంచారం ఉండే ప్రాంతంలో ఉన్న బ్యాంకులో దోపిడీ చేయడం పట్టణంలో చర్చనీయాంశ మైంది. కొంత కాలంగా పట్టణంలో వరుస చోరీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో పలు చోట్ల చైన్‌ స్నాచి0గ్‌లు జరిగాయి. గత నెలలో మండలంలోని మూడుచోట్ల దుండగలు చోరీలకు పాల్పడ్డారు. ఈ కేసుల్లో ఇంత వరకు పురోగతి లేదు. పోలీసులకు వరున చోరీలు ఛాలెంజ్‌గా
మారాయి. పట్టణం బంగారు నగల వ్యాపారానికి పెట్టింది 'పేరు. నిత్యం రూల్‌ నుంచి రూ.10 కోట్లు వ్యాపారం జరుగుతుంది. పట్టపగలే బ్యాంకులో చోరీ చేస్తే తమ పరిస్థితి ఏమిటనే భయం వ్యాపారుల్లో నెలకొంది.