ఏసీబీ వలలో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిశ్రమల అధికారి

ఏసీబీ వలలో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిశ్రమల అధికారి

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిశ్రమల అధికారి ఏసీబీ వలకు చిక్కారు. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్ణపల్లి మండలం అడవి పదిర గ్రామానికి చెందిన వెంకటేశ్​అనే వ్యక్తి నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.

జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న ఉపేందర్ రావు.. టిప్పర్ బండి సబ్సిడీ కోసం భూక్యా సరిత అనే మహిళను రూ.30 వేల లంచం డిమాండ్​చేశాడు.

సిరిసిల్ల పట్టణంలోని గీతనగర్ జెడ్పీ హైస్కూల్​లో ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఉపేందర్ రావు ఉండగా.. భూక్య సరిత మరిది వెంకటేష్ కాల్ చేసి బయటకు రమ్మని చెప్పాడు. దీంతో లంచం డబ్బులు తీసుకునేందుకు ఉపేందర్ రావు బయటకు వచ్చాడు. డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.