జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు పెద్దదిక్కు : శ్రీధర్ బాబు

జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు పెద్దదిక్కు : శ్రీధర్ బాబు

జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు పెద్దదిక్కని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జీవన్ రెడ్డి మనోభావాలను పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. చేరికల విషయంలో సమన్వయ లోపం జరిగిందని అందర్నీ సంప్రదించి పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. జీవన్ రెడ్డి గౌరవానికి ఇబ్బంది కలగకుండా చూస్తామని తగిన న్యాయం చేస్తామని అన్నారు.  క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పార్టీ ఆదేశానుసారం 2006, 2008లతో పాటు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను నిలబెట్టారని గుర్తు చేశారు. 

  జరిగిన పరిణామాలపై శ్రీధర్బాబుతో చర్చించామని అన్నారు జీవన్ రెడ్డి.  దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేసిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయిని  ప్రభుత్వానికి అండగా ఉండేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని అన్నారు.   కానీ కార్యకర్తల మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత పార్టీపై ఉందని తెలిపారు. తన భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుందని జీవన్ రెడ్డి తెలిపారు.