అనాధ అయినట్లు అనిపిస్తుంది : జీవిత రాజశేఖర్

అనాధ అయినట్లు అనిపిస్తుంది  : జీవిత రాజశేఖర్

తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దవాళ్లను కోల్పోవడం వర్ణించలేని బాధ అని సినీ నటి జీవిత రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. అందరిని కోల్పోతుంటే అనాధలా అనిపిస్తుందన్నారు. కైకాల మరణం తీరని లోటు అని ఆమె బాధపడ్డారు. సీనియర్ సినీ నటుడు కైకాల సత్యనారాయణకు మృతికి జీవిత సంతాపం తెలిపారు. కైకాల పార్థివదేహానికి పూల మాలలు వేసి తుది నివాళులర్పించారు.

ఇవాళ జూబ్లీహిల్స్‭లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కైకాలకు తుది వీడ్కోలు పలికారు. కైకాల పార్థివదేహాన్ని ఫిలింనగర్‭లోని ఆయన ఇంటి నుంచి మహాప్రస్థానంకు అంతిమయాత్రగా తీసుకువచ్చారు. అధికార లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు నిర్వహించారు.