అమెజాన్ సీఈవోగా తప్పుకోనున్న బెజోస్

అమెజాన్ సీఈవోగా తప్పుకోనున్న బెజోస్

ప్రముఖ ఆన్‌‌లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ సీఈవో, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జెఫ్ బెబోస్ గురించి వినే ఉంటారు. అమెజాన్‌‌ను ఆన్‌‌లైన్ బుక్‌స్టోర్‌‌లా మొదలుపెట్టిన బెబోస్.. అనతికాలంలోనే దాని సర్వీసులను మరింతగా పెంచుకుంటూ అతిపెద్ద సంస్థకు అధిపతిగా నిలిచారు. అలాంటి బెబోస్ అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుంటారనే వార్త షాక్‌‌కు గురి చేస్తోంది. ఈ ఏడాది బెజోస్ సీఈవో పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈ వార్తను స్వయంగా బెజోస్ ప్రకటించారు. పదవి నుంచి మారడానికి ఇదే సరైన సమయమని ఆయన చెప్పారు.

చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌‌ బాధ్యతల నుంచి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌‌గా బెజోస్ కొత్త రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారని అమెజాన్ కూడా స్పష్టం చేసింది. అమెజాన్‌ను 1995లో స్థాపించారు. తొలుత డైపర్లు, టీవీలను ఉచితంగా చాలా వేగంగా అమెజాన్ డెలివరీ చేసేది. ఆ తర్వాత బెజోస్ తన తెలివితేటలు, సమర్థతతో కంపెనీని అంచెలంచెలుగా ఎదిగేలా చేస్తూ ఆన్‌‌లైన్ షాపింగ్‌‌లో నంబర్ వన్ స్థానానికి చేర్చారు. బెజోస్ స్థానంలో ఆండీ జెస్సీ కొత్త సీఈవోగా బాధ్యతలు తీసుకోనున్నారు.