World Cup 2025: వరల్డ్ కప్ గెలిచిన ముంబై క్రికెటర్లకు భారీ నగదు.. జెమీమా, మంధాన, రాధలకు ఒక్కొక్కరికి రూ.2.25 కోట్లు

World Cup 2025: వరల్డ్ కప్ గెలిచిన ముంబై క్రికెటర్లకు భారీ నగదు.. జెమీమా, మంధాన, రాధలకు ఒక్కొక్కరికి రూ.2.25 కోట్లు

సౌతాఫ్రికాపై విజయం సాధించి తొలిసారి వరల్డ్ కప్ టైటిల్ సొంతం చేసుకున్న టీమిండియా తమ కలను సాకారం చేసుకుంది. వరల్డ్ కప్ జట్టులో భాగమైన టీమిండియా క్రికెటర్లు  జెమిమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, రాధా యాదవ్ లకు తమ రాష్ట్ర ప్రభుత్వాలు భారీ నజరానా ప్రకటించాయి. ఒకొక్కరికి రూ. 2.25 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్‌కు రూ.22.5 లక్షల నగదు అవార్డు అందజేయనున్నారు. 

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో జెమీమా మ్యాచ్ విన్నింగ్ సెంచరీతో జట్టును గెలిపించి సెమీస్ కు తీసుకెళ్లింది. 132 బంతుల్లో 127 పరుగులు చేసి భారీ ఛేజింగ్ లో లైఫ్ టైం బెస్ట్ ఇన్నింగ్స్ ఆడింది. స్మృతి మందాన 434 పరుగులు చేసి టోర్నీలో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసింది. ఫైనల్లో 45 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. రాధ యాదవ్ స్పిన్నర్ గా టోర్నీలో రాణించింది.   

టీమిండియా ఫాస్ట్ బౌలర్లు రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్ లకు తమ రాష్ట్ర ప్రభుత్వాలు కోటి రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. వరల్డ్ కప్ ఫైనల్లో రేణుక పొదుపుగా బౌలింగ్ చేసింది. వికెట్ తీయకున్నా 8 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చింది. భారత మహిళా క్రికెట్ ఫాస్ట్ బౌలర్  క్రాంతి గౌడ్‌కు సైతం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది.

ఇండియా వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన దీప్తి శర్మ, రిచా ఘోష్‌లను ఈస్ట్ బెంగాల్ క్లబ్ సత్కరించనుంది. వరల్డ్ కప్ తన ఆల్ రౌండ్ షో తో అద్భుతంగా రాణించిన దీప్తికు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికైంది. తొమ్మిది మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్ గా నిలిచింది. ఫైనల్లో కీలకమైన 58 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్ లో 5 వికెట్లు పడగొట్టింది. రిచా 39.16 యావరేజ్ తో 235 పరుగులు చేసింది. టోర్నీలో ఆమె అత్యధిక స్ట్రైక్ రేట్ (133.52) తో బ్యాటింగ్ చేసింది. అంతేకాదు టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సర్లు (12) బాదిన రికార్డు ఆమె పేరిట నిలిచింది.