4 నెలల్లో జెట్‌ ఎయిర్​వేస్​ విమానాలు

4 నెలల్లో జెట్‌ ఎయిర్​వేస్​ విమానాలు
  • పేరు మార్చం: మురారీ లాల్‌‌ జలాన్‌‌

న్యూఢిల్లీ: జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్‌‌ పేరుతోనే ఆపరేషన్స్‌‌ను ప్రారంభిస్తామని కల్‌‌రాక్‌‌ నేతృత్వంలోని కన్సార్షియం పేర్కొంది. అసెట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కంపెనీ కల్‌‌రాక్‌‌ క్యాపిటల్‌‌, ఎంటర్‌‌‌‌ప్రెనూర్‌‌ మురారీ లాల్‌‌ జలాన్‌‌లు కలిసి మూతపడిన జెట్‌‌ ఎయిర్‌‌‌‌ వేస్‌‌ కోసం బిడ్స్‌ వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్‌‌(ఎన్‌‌సీఎల్‌‌టీ) నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ అనుమతి వస్తే  జెట్‌‌ఎయిర్‌‌‌‌ వేస్‌‌ ఆపరేషన్స్‌‌ను 4–6 నెలల్లో తిరిగి ప్రారంభిస్తామని ఈ కన్సార్షియం పేర్కొంది. ఈ కన్సార్షియం ప్రపోజ్‌‌ చేసిన రిజల్యూషన్‌‌ ప్లాన్‌‌ను ఎన్‌‌సీఎల్‌‌టీ సోమవారం విననుంది.  ‌‌కొత్త ప్రమోటర్లు జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్‌‌ బ్రాండ్‌‌ను,  కొంత మంది ఓల్డ్‌‌ స్టాఫ్‌‌ను కొనసాగించనున్నారు. జెట్ ఎయిర్‌‌‌‌వేస్‌‌ ఆపరేషన్స్‌‌ను 25 విమానాలతో ఈ కన్సార్షియం రీస్టార్ట్ చేయనుంది. ఇంటర్నేషనల్‌‌ ఫ్లయిట్ సర్వీస్‌‌లను ఈ ఏడాది చివరిలోపు తిరిగి ప్రారంభించాలని ప్లాన్స్ వేసుకుంది. ఎన్‌‌సీఎల్‌‌టీ నుంచి వచ్చే అనుమతులపై ఇది ఆధారపడి ఉంది.  రిజల్యూషన్‌‌ ప్లాన్‌‌కు ఎన్‌‌సీఎల్‌‌టీ నుంచి ఎంత తొందరగా అప్రూవల్స్ వస్తే అంతే తొందరగా ఆపరేషన్స్‌‌ను రీస్టార్ట్ చేస్తామని మురారీ లాల్‌‌ జలాన్‌‌ అన్నారు. ఈ సమ్మర్‌‌‌‌లోనే జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్‌‌ ఆపరేషన్స్‌‌ తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నామని చెప్పారు. ఫైనాన్షియల్‌‌గా తాము మంచి పొజిషన్‌‌లో ఉన్నామని చెప్పారు. కరోనా పరిస్థితుల వలన జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్‌‌ను మంచి ధరకే పొందగలిగామని, భవిష్యత్‌‌లో కూడా ఖర్చులు తక్కువగా ఉంటాయని అన్నారు. జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్‌‌ను ఎటువంటి అప్పుల్లేకుండా ప్రారంభిస్తాం కాబట్టి మిగిలిన కంపెనీలతో పోలిస్తే మంచి పొజిషన్‌‌లో ఉంటామని చెప్పారు. ఎయిర్‌‌‌‌లైన్స్‌‌ మార్కెట్‌‌ రికవరీ అయ్యే టైమ్‌‌కి ఆపరేషన్స్‌‌ స్టార్ట్ చేస్తామని అన్నారు.  కమిటీ ఆఫ్ క్రెడిటార్ల తమ ప్రపోజల్‌‌ను ఒప్పుకున్నారని జలాన్​ వివరించారు.

ఇవి కూడా చదవండి

భారత మార్కెట్లో దూసుకుపోతున్న బిల్ పే

68 ఏండ్లు జైల్లోనే: 83 ఏండ్ల వయసులో బయటికొచ్చిండు

చార్మినార్ ను డేంజర్లో పడేస్తున్నరు!

నాటినోళ్ల పేరే.. మొక్కకు పెడుతున్నరు