రోడ్డెక్కిన జెట్: ఢిల్లీలో ఉద్యోగుల ప్రదర్శన

రోడ్డెక్కిన జెట్: ఢిల్లీలో ఉద్యోగుల ప్రదర్శన

జీతాల బకాయి లు చెల్లించాలంటూ జెట్‌ ఎయిర్‌ వేస్ ఉద్యోగులు ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో శుక్రవా-రం ఆందోళన చేశారు. ‘సేవ్ జెట్‌ ఎయిర్‌ వేస్‌‌‌‌, సేవ్‌‌‌‌ అవర్‌ ఫ్యూచర్‌ ’, ‘మా బాధ వినండి . జెట్‌ ను ఎగరనివ్వండి ’ అని రాసి ఉన్న ప్లకార్డు లను ప్రదర్శించారు. జెట్‌ ఉద్యోగులు ముం బైలోనూ శుక్రవారం మౌన ప్రదర్శన నిర్వహించారు. ఒకప్పుడు 120 దాకా విమానాలు నడిపిన ఈ కంపెనీ ప్రస్తుతం ఆరేడు విమానాలకు పరిమితమయింది. ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసం మధ్యంతర నిధులు ఇవ్వాలని లెండర్లను కోరింది. తాజాగా నిధులు అందితేనే జీతాల చెల్లింపు సాధ్యమని భావిస్తున్నారు. జెట్‌ ఎయిర్‌ వేస్‌‌‌‌ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కంపెనీ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ , ఆయన భార్య అనితా గోయల్‌ , ఎతిహాద్‌ ఎయిర్‌ వేస్‌‌‌‌ నామినీ కెవిన్‌‌‌‌ నైట్‌ బోర్డు నుంచి ఇటీవల వైదొలిగారు. గోయల్‌ చైర్మన్‌‌‌‌గానూ తప్పుకున్నారు. దీంతో కంపెనీ లెండర్ల (అప్పులు ఇచ్చిన బ్యాంకులు) చేతుల్లోకి వెళ్లింది. వీళ్లు జెట్‌ ఆస్తులను తనఖా పెట్టుకొని తక్షణం డెట్‌ ఇన్‌‌‌‌స్ట్రమెంట్ల రూపంలో రూ.1,500 కోట్లు ఇచ్చారు. లెండర్లు తమ తరఫు నుంచి ఇద్దరు డైరెక్టర్లను బోర్డులోకి నామినేట్‌ చేశారు. షేర్లను కొత్త ఇన్వెస్టర్లకు అమ్మడానికి లెండర్లు   బిడ్డింగ్‌ ను మొదలుపెట్టారు. జూన్‌ క్వార్టర్ లో ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి .లెండర్ల ఇంటెరియమ్ నేజ్‌ మెంట్‌ కమిటీ కంపెనీ రోజువారీ, ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటోంది. గోయల్​ వాటా తగ్గడంతో బ్యాంకులకు 50.5 శాతం వాటాతో కంపెనీపై నియంత్రణ లభించింది.