అమెరికాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..పాల్గొన్న పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝూన్సీ రాజేందర్ రెడ్డి

అమెరికాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..పాల్గొన్న పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝూన్సీ రాజేందర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: అమెరికాలో గ్లోబల్ తెలంగాణ అసోషియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం రాలీ నగరంలో సోమవారం జరిగిన ఈ బతుకమ్మ ఆటా పాట కార్యక్రమానికి ‘వెటా’ ఫౌండర్, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అమెరికాలోని తెలంగాణ ప్రజలు ఆనందోత్సవాల మధ్య జరుపుకొని, విదేశాల్లో కూడా మన పండుగల ప్రాధాన్యతను తెలియజేస్తూ భావి తరాలకు వాటి విశిష్టతను తెలియజేయడం అభినందనీయమన్నారు. ఈ వేడుకల్లో ఝాన్సీరెడ్డితో పాటు ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికాలో ప్రవాస తెలంగాణ మహిళల ఐక్యతను బతుకమ్మ ఆటాపాటాలతో మరోసారి చాటుకున్నారని ఝూన్సీరెడ్డి చెప్పారు.