నేను రిజైన్ చేయడంలేదు : జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్

నేను రిజైన్ చేయడంలేదు : జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బుధవారం(జనవరి3) న కీలక సమావేశం నిర్హహించారు హేమంత్ సోరెన్. అనంతరం ఈ ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని ఎమ్మెల్యేలకు సూచించారు. ఎమ్మెల్యేలు కూడా మేమంతా సోరేన్ వైపు ఉన్నామంటూ ప్రకటించారు. హేమంత్ సోరెనే మా ముఖ్యమంత్రి అని  భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటారని ప్రకట్రించారు. సోరేన్ పదవీ కాలం పూర్తి చేస్తారని ప్రకటించారు. 

 ఈడీ సమన్లపై స్పందించిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్.. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి తమ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేందుకు బీజేపీ అన్ని విధాలా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఏ పోరాటానికి కైనా సిద్ధంగా ఉన్నానని హేమంత్ సోరెన్ చెప్పారు. జార్ఖండ్ సీఎం గా కొనసాగుతాననడంలో ఎలాంటి సందేహం లేదన్నారు హేమంత్ సోరెన్. 

అయితే అక్రమ మైనింగ్ కేసుల్లో తన సన్నిహితులపై ఈడీ దాడులు చేస్తున్న క్రమంలో సీఎం సోరేన్ రాజీనామా చేసి ఆయన భార్య కల్పనా సోరెన్ కు అప్పగించాలని చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. బుధవారం (జనవరి 3) తెల్లవారు జామున అక్రమ మైనింగ్ పై మనీలాండరింగ్ విచారణలో భాగంగా జార్ఖండ్ సీఎం ప్రెస్ అడ్వైజర్ , సాహిబ్ గంజ్ జిల్లా అధికారులు, మాజీ ఎమ్మెల్యే ఇండ్లపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. జార్ఖండ్ రాజధాని రాంచీతో పాటు రజస్థాన్ లోని పలు ప్రాంతాలతో పాటు జార్ఖండ్ లోని అనేక ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. 

ఈ క్రమంలో సీఎం హేమంత్ సోరేన్ తన నివాసంలో ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి ఎటువంటి ప్రమాదం ఉండదు.. తానే సీఎం గా కొనసాగుతానని భరోసా ఇచ్చేందుకు ఈ అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.