చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ఇద్దరు మావోయిస్టులు మృతి

చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ఇద్దరు మావోయిస్టులు మృతి

బీజాపూర్: చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో శనివారం (మే25) ఎన్ కౌంటర్ జరిగింది. జప్పెమార్క , కంకనార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలంలో ఆయుధాలు, వైర్ లెస్ సెట్లు, మావోయిస్టుల యూనిఫాం, మందులు, నిషేధిత మావోయిస్టుల సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.  

కాగా గురువారం(మే 23) బీజాపూర్, నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఇంతకుముందు చత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో కాంకేర్ లో జరిగిన మవోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య జరిగి ఎన్ కౌంటర్ లో  29 మంది మావోయిస్టుల మృతిచెందగా.. ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.