T20 World Cup 2024: జట్టులో విభేదాలు.. వైస్ కెప్టెన్ లేకుండానే ప్రపంచకప్‌కు పాకిస్థాన్

T20 World Cup 2024: జట్టులో విభేదాలు.. వైస్ కెప్టెన్ లేకుండానే ప్రపంచకప్‌కు పాకిస్థాన్

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) శుక్రవారం తమ జట్టును అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. బాబ‌ర్ ఆజాం సారథ్యంలో 15 మందితో కూడిన స్క్వాడ్‌ను అధికారికంగా వెల్లడించింది. ఈ జట్టులో సీనియ‌ర్లు ఇమ‌ద్ వ‌సీం, మ‌హ్మద్ అమిర్‌ల‌కు చోటుద‌క్కగా.. ఐదుగురు కుర్రాళ్లు జాక్‌పాట్ కొట్టారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఆ జట్టు వైస్ కెప్టెన్ లేకుండానే పొట్టి ప్రపంచ కప్ సమరంలోకి దిగుతోంది. 

పాక్ క్రికెట్ బోర్డు శుక్రవారం తమ జట్టును అనౌన్స్ చేసే వైస్ కెప్టెన్ పేరును ప్రస్తావించలేదు. గత కొంత కాలంగా దాయాది జట్టు పేలవ ప్రదర్శన కనపరుస్తోంది. ఇంటా.. బయటా అన్ని ఓటములే ఎదురువుతున్నాయి. ఈ క్రమంలో పీసీబీ 'వైస్ కెప్టెన్' పదవిని కనుమరుగు చేసేందేమో అని అందరూ అనుకున్నారు. కాదంటే వారి వ్యూహంలో ఇదొక భాగమేనని అని అనుకున్నారు. కానీ, అవేవీ కావు. డిప్యూటీని ప్రకటించపోవడానికి ప్రధాన కారణం.. ఆటగాళ్ల మధ్య సఖ్యత లేకపోవడం. జట్టులో అంతర్గత కుమ్ములాటలు.  

బాబర్ vs షాహీన్

ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజాం, మాజీ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది మధ్య గతేడాది కాలంగా సఖ్యత లేదని కథనాలు వస్తున్నాయి. అందునా, ఇటీవల అఫ్రిదిని టీ20 కెప్టెన్సీని తప్పించడంతో ఆ గొడవ తారా స్థాయికి చేరిందని పాక్ మీడియా కోడై కూస్తోంది. వైస్ కెప్టెన్సీ పదవి కోసం పిసిబి.. షాహీన్ అఫ్రిదిని సంప్రదించినప్పటికీ ఆ ఆఫర్‌ను అతను తిరస్కరించినట్లు వార్తలొస్తున్నాయి. ఐసిసి గడువుకు నాలుగు గంటల ముందు కూడా సెలక్షన్ కమిటీ.. స్టార్ పేసర్‌ను సంప్రదించిందని ఆ దేశ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ పేర్లు పరిగణలోకి వచ్చిన గొడవల కారణంగా వారిద్దరూ అంగీకరించలేదని సమాచారం. దీంతో బాబర్ సేన డిప్యూటీ లేకుండానే టీ20 ప్రపంచకప్‌లో ఆడాలని పీసీబీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

టీ20 ప్రపంచ కప్‌కు పాకిస్తాన్ జట్టు:

బాబర్ ఆజం (కెప్టెన్), సయీమ్ అయూబ్, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఆజం ఖాన్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, నసీమ్ షా, షాహీన్ అఫ్రీది.

మరిన్ని వార్తలు