నేనొక ఏలియన్ను..త్వరలో ఎవిడెన్స్ చూసిస్తాను: ఎలాన్ మస్క్

నేనొక ఏలియన్ను..త్వరలో ఎవిడెన్స్ చూసిస్తాను: ఎలాన్ మస్క్

ఎలాన్ మస్క్  ఒక ఏలియనా?..అవునట..ఎలాన్ మస్క్ ఇప్పుడు అదే వాదిస్తున్నాడు..నేను ఏలియన్ ను.. త్వరలో మీకు ఎవిడెన్స్ చూపిస్తానంటున్నాడు. వైవా టెక్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ విషయాన్ని నొక్కి వక్కాణించారు. ఎలాన్ మస్క్ ప్రకటనతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఎలాన్ మస్క్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వివా టెక్ ఇంటర్ వివా టెక్‌లో ఓ ఇంటర్వ్యూలో ఎలోన్ మస్క్  నవ్వుతూ గ్రహాంతరవాసిని అని చెప్పారు. మస్క్.. మానవులు AI మధ్య సంభావ్య సంబంధాన్ని చర్చించాడు. మానవులు AIకి అర్థాన్ని ఇస్తారని చెప్పారు. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ సోషల్ మీడియాలో గ్రహాంతర సాక్ష్యాలను పంచుకుంటానని హామీ ఇచ్చారు

మీరు గ్రహాంత వాసి అని కొందరు నమ్ముతున్నారు అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు మస్క్ వెంటనే సమాధానం ఇచ్చారు.. నేను గ్రహాంతర వాసిని.. అవును నేను గ్రహాంత వాసిని అని ప్రజలకు చెబుతూనే ఉన్నాను. కానీ ఎవరూ నమ్మడం లేదు. త్వరలో సోషల్ మీడియాలో గ్రహాంతర సాక్ష్యాలను పంచుకుంటానని హామీ ఇచ్చారు. 
ఈ ఇంటర్వ్యూలో మస్క్ ..అంగారక గ్రహంపై నివాసం గురించి కూడా మాట్లాడారు. ‘‘నేను అనుకుంటున్నాను .. మార్స్ పైకి వెళ్లే మొదటి   వ్యక్తుల మేం కావొచ్చు.అదీ కూడా పదేళ్లలో.. ఇంకా చెప్పాలంటే ఏడెనెమిదేళ్లలో కూడా కావొచ్చని’’   మస్క్  అందరిని ఆశ్చర్యపర్చే జోస్యం చెప్పారు.