ఆమెను ప్రేమించాను కానీ... సీఎం సిద్ధరామయ్య బ్రేకప్ లవ్ స్టోరీ

ఆమెను ప్రేమించాను కానీ... సీఎం సిద్ధరామయ్య బ్రేకప్ లవ్ స్టోరీ

తాను కులాంతర వివాహాం చేసుకోవాలని అనుకున్నాను కానీ అందుకు ప్రేమించిన అమ్మాయి, వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకోలేదన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు.  మైసూరులో జరిగిన ఓ సమావేశానికి హాజరైన ఆయన తన బ్రేకప్ లవ్ స్టోరీని పంచుకున్నారు.  తాను కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డానని ఆమెను కులాంతర వివాహం చేసుకోవాలనుకున్నానన్నారు. అయితే  కానీ కులం కారణంగా తన ప్రేయసి, ఆమె కుటుంబం పెళ్లికి అంగీకరించలేదని చెప్పారు.  దీంతో తాను ప్రేమించిన అమ్మాయితో కాకుండా.. తన కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి పరిస్థితి వచ్చిందన్నారు. 

 ఈ సందర్భంగా సీఎం  కులాంతర వివాహాలకు తన పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. కులాంతర వివాహం చేసుకునేవారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. కులతత్వాన్ని నిర్మూలించడానికి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని అన్నారు  సిద్ధరామయ్య.  ఒకటి కులాంతర వివాహాలు  అయితే మరోకటి రెండోది అన్ని వర్గాల మధ్య సామాజిక-ఆర్థిక సాధికారిత అని చెప్పారు. సమాజంలో సమానత్వం కోసం అనేక మంది సంఘ సంస్కర్తలు చేసిన కృషికి ఇంకా ఫలితం రాలేదన్నారు.