Manchu Vishnu: అసత్య ప్రచారాలు ఆపండి..హేమ ఇమేజ్ను దెబ్బ తీయడం అన్యాయం: మంచు విష్ణు ట్వీట్

Manchu Vishnu: అసత్య ప్రచారాలు ఆపండి..హేమ ఇమేజ్ను దెబ్బ తీయడం అన్యాయం: మంచు విష్ణు ట్వీట్

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో సినీ నటి హేమ (Hema) పేరు బయటకు రావడం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. అంతేకాదు..ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హేమకు నోటీసులు జారీ చేస్తూ..మే 27న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరు కావాలని నోటీసులో తెలిపారు 

ఈ నేపథ్యంలోనే కరాటే కల్యాణి, సహా పలువురు ఆర్టిస్టులు హేమపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో నటి హేమపై కొన్ని మీడియా సంస్థలు నిరాధార ఆరోపణలు చేస్తుందంటూ మా అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) తన వంతుగా మద్దతు పలికారు. తాజాగా మంచు విష్ణు చేసిన ట్వీట్ కాస్తా హాట్ టాపిక్ గా మారింది. 

"ఇటీవల రేవ్ పార్టీలో జరిగిన డ్రగ్స్ కేసుకు సంబంధించి, కొన్ని మీడియా సంస్థలు మరియు వ్యక్తులు నటి శ్రీమతి హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.ఇక నుంచి హేమపై అసత్య ప్రచారాలు ఆపాలని మంచు విష్ణు సూచించారు.హేమపై నేరం ఇంకా రుజువు కాలేదని తెలిపారు.హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే భావించాలి. నిరాధారమైన ఆరోపణలతో హేమ ప్రతిష్టకు భంగం కలిగించవద్దని ప్రతిఒక్కరికీ విజ్ఞప్తి చేశారు.

అయితే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA)..ఎట్టి పరిస్థితుల్లో భరించదని తెలిపారు. ఒకవేళ పోలీసులు హేమ మీద కచ్చితమైన సాక్ష్యాలను అందజేస్తే తక్షణమే ఆమెపై 'మా' తగిన చర్యలు తీసుకుంటుంది. అప్పటివరకు నిరాధారమైన వార్తలను పట్టించుకోవద్దని..ప్రసారం కూడా చేయకండి" అంటూ  మంచు విష్ణు సూచించారు.