ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం.. 100 అడుగుల నీటిలో దూకి చనిపోయిండు

 ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం..   100 అడుగుల నీటిలో దూకి చనిపోయిండు

సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి యువత హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. లేనిపోని సాహసాలకు చేసి ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.  తాజాగా జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో 18 ఏళ్ల యువకుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేయడానికి ఎత్తు నుండి లోతైన నీటిలో దూకి చనిపోయాడు.  తౌసిఫ్ అనే వ్యక్తి మే 22వ తేదీ సాయంత్రం సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి క్వారీ సరస్సులోకి దూకాడు.  

అందులో నుంచి బయటకు రాకపోవడంతో  అతని స్నేహితులు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో  వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో  వారు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి..   అనంతరం యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. 

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ కుష్వాహా తెలిపిన వివరాల ప్రకారం యువకుడు  నీటిలోకి దూకిన తరువాత తనను తాను నియంత్రించుకోలేక నీటిలో మునిగి చనిపోయాడని తెలిపారు. కాగా యువకుడు లోతైన నీటిలో దూకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.