హమాస్​కు ఇరాన్ మద్దతు

హమాస్​కు ఇరాన్ మద్దతు

జెరూసలెం: హక్కుల కోసం పోరాడుతున్న పాలస్తీనియన్లకు ముస్లిం దేశాలన్నీ అండగా నిలవాలని ఇరాన్ పిలుపునిచ్చింది. ఇది పాలస్తీనియన్ల సెల్ఫ్ డిఫెన్స్ అంటూ ఇరాన్ విదేశాంగ శాఖ ఈ దాడులను సమర్థించింది. ఇజ్రాయెల్ పై హమాస్ దాడుల పట్ల ఇరాన్, బ్రిటన్ దేశాల్లో పాలస్తీనియన్ మద్దతుదారులు వేడుకలు చేసుకున్నారు. హమాస్ దాడులు గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. అయితే, ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతను తగ్గించేలా మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తుర్కియే ప్రకటించింది. ఈజిప్టు కూడా మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులపై ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.  

ఈజిప్టులో ఇజ్రాయెలీలపై పోలీసు కాల్పులు

ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో ఆదివారం పలువురు ఇజ్రాయెలీ టూరిస్టులపై ఓ పోలీసు అధికారి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెలీ టూరిస్టులు మరణించారు. 

పాలస్తీనా దేశం ఏర్పాటుచెయ్యాలె: చైనా

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిస్థితి శాంతి ప్రక్రియకు మరోసారి విఘాతం కలిగించిందని పేర్కొంది. రెండు ప్రాంతాల మధ్య ఘర్షణలకు ముగింపు పలకాలంటే.. రెండు ప్రత్యేక దేశాల ఏర్పాటే మార్గమని అభిప్రాయపడింది.