
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ బుధవారం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే సమక్షంలో జిష్ణు దేవ్ వర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, హైకోర్టు జడ్జీలు అటెండ్ కానున్నారు.