పార్టీలకతీతంగా సుదర్శన్ రెడ్డికి ఓటెయ్యాలి : జితేందర్ రెడ్డి

పార్టీలకతీతంగా సుదర్శన్ రెడ్డికి ఓటెయ్యాలి : జితేందర్ రెడ్డి
  • ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి పార్టీలకు అతీతంగా ఓటెయ్యాలని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి కోరారు. ఆదివారం ఢిల్లీలో సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జస్టిస్ సుదర్శన్ రెడ్డి దేశ సమగ్రత, రాజ్యాంగ విలువలకు కట్టుబడిన వ్యక్తి అని అన్నారు. 

న్యాయరంగంలో ఆయన ఇచ్చిన కీలక తీర్పులు.. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ స్ఫూర్తికి ఆదర్శనీయమన్నారు. సుదర్శన్ రెడ్డి లాంటి వ్యక్తి సేవలు ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి అవసరమని, అందుకే రాజకీయాలకు అతీతంగా ఆయనకు మద్దతుగా నిలవాలన్నారు.