జొకొవిచ్‌‌కు షాక్‌‌ ..ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌లో పెను సంచలనం

జొకొవిచ్‌‌కు షాక్‌‌ ..ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌లో పెను సంచలనం

పారిస్‌‌: ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌లో పెను సంచలనం నమోదైంది. కెరీర్‌‌లో 25వ గ్రాండ్‌‌స్లామ్‌‌ వేటలో ఉన్న సెర్బియా సూపర్‌‌ స్టార్‌‌ నొవాక్‌‌ జొకోవిచ్‌‌ మూడో రౌండ్‌‌లోనే ఇంటిముఖం పట్టాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌లో మూడోసీడ్‌‌ జొకోవిచ్‌‌ 6–4, 6–4, 3–6, 5–7, 5–7తో 28వ సీడ్‌‌ జోవా ఫోన్సెకా (బ్రెజిల్‌‌) చేతిలో పోరాడి ఓడాడు. 4 గంటలా 53 నిమిషాల మ్యాచ్‌‌లో జొకో తొలి రెండు సెట్లలో అద్భుతంగా ఆడినా.. తర్వాతి మూడు సెట్లలో ఫోన్సెకా ఆట ముందు నిలవలేకపోయాడు.

ఇతర మ్యాచ్‌‌లో రబ్లెవ్‌‌ (రష్యా) 7-–5, 7–-6 (7/2), 7–-6 (7/2)తో బోర్జెస్‌‌ (పోర్చుగల్‌‌)పై, జోదర్‌‌ (స్పెయిన్‌‌) 7–6 (7/2), 6–-7 (5/7), 4–-6, 6–-3, 6–-3తో మిచెల్‌‌సెన్‌‌ (అమెరికా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌‌లోకి ప్రవేశించారు. విమెన్స్‌‌ సింగిల్స్‌‌ మూడో రౌండ్‌‌లో ఇగా స్వైటెక్‌‌ (పోలెండ్‌‌) 6–4, 6–4తో మగ్దా లినెట్‌‌ (పోలెండ్‌‌)పై, మిరా ఆండ్రీవా (రష్యా) 6–4, 6–2తో మరియా బౌజ్‌‌కోవా (చెక్‌‌)పై, మార్టా కోస్ట్యుక్‌‌ (ఉక్రెయిన్‌‌) 6–4, 6–3తో విక్టోరియా గోల్బిక్‌‌ (స్విట్జర్లాండ్‌‌)పై, స్వితోలినా (ఉక్రెయిన్‌‌) 6–2, 6–3తో తమరా కోర్పాచ్‌‌ (జర్మనీ)పై గెలవగా, ముచోవా (చెక్‌‌) 1–6, 5–7తో టెచ్‌‌మన్‌‌ (స్విట్జర్లాండ్‌‌) చేతిలో ఓడింది. మెన్స్‌‌ డబుల్స్‌‌లో రెండో రౌండ్‌‌లో యూకీ బాంబ్రీ–మైకేల్ వీనస్‌‌ (న్యూజిలాండ్‌‌) 3–6, 4–6తో సిమోన్‌‌ బోలెలి–ఆండ్రియా వావసోరి (ఇటలీ) చేతిలో ఓడారు.

మరిన్ని వార్తలు