కరోనాతో మరణించిన డాక్టర్‌‌‌‌ భార్యకు ఉద్యోగం

కరోనాతో మరణించిన డాక్టర్‌‌‌‌ భార్యకు ఉద్యోగం

హైదరాబాద్, వెలుగు: కరోనా రోగులకు సేవలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ నరేశ్ భార్యకు గ్రూప్ వన్ కేడర్ ఉద్యోగం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్‌‌‌‌ నరేశ్ భార్య పావనికి గురువారం ఈ ఉత్తర్వులను అందజేశారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ ఆఫీసులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌‌‌‌గా ఆమెకు పోస్టింగ్ ఇస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని పావనికి సూచించారు. తన భర్త సేవలను గుర్తించి, తనకు ఉద్యోగం ఇచ్చినందుకు పావని మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా టైమ్​లో భద్రాది కొత్తగూడెం డిప్యూటీ డీఎంహెచ్‌‌వోగా, జిల్లా కరోనా నోడల్ ఆఫీసర్‌‌‌‌గా డాక్టర్ నరేశ్ పనిచేశారు. ఈ క్రమంలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కేంద్రం నరేశ్ భార్యకు రూ.50 లక్షల ఎక్స్‌‌గ్రేషియా ఇవ్వగా, రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. ఈ నియామకం పట్ల తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్‌‌ అసోసియేషన్ ప్రెసిడెంట్‌‌ డాక్టర్ కత్తి జనార్దన్‌‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

For More News..

దవాఖాన్లకే మస్తు పైసల్.. 18 వేల జీతంలో 4 వేలు ఆస్పత్రికే