
నిజామాబాద్ సిటీ, వెలుగు: నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 20న ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఎంప్లాయ్మెంట్ఆఫీసర్ సిరిమల్ల శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ లోని సుస్థిర, ఇన్ఫ్రా, హోదా కంపెనీల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్, సైట్ ఇన్చార్జి, టెలీకాలర్స్ ఉద్యోగాలు ఉంటాయన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ యువత శివాజీ నగర్ లోని ఎంప్లాయ్మెంట్ఆఫీస్ లో 20 న 10 గంటల లోపు పూర్తి వివరాలతో హాజరుకావాలని కోరారు.