
రంగారెడ్డి, వెలుగు: దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 26 ప్రైవేట్ సంస్థల్లో 1,128 ఖాళీల భర్తీకి ఈ నెల 6న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి అధికారి జయ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మంగళవారం ఉదయం 10.30 గంటలకు షాద్‌నగర్‌లోని రంగాపూర్‌లో ఉన్న నాట్కో హై స్కూల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. స్టార్‌బక్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, విప్రో, బిగ్‌బాస్కెట్, రిలయన్స్, రేడియంట్, హెటిరో, ఇతర సంస్థల్లో వాయిస్, నాన్‌వాయిస్, టెక్నికల్లో అవకాశాలున్నాయన్నారు. పూర్తి వివరాలకు 9849280891, 9063099306 నంబర్లకు కాల్ చేయాలన్నారు.