విదేశాలను మించిన జాబ్ ఆఫర్స్ ఇక్కడే

విదేశాలను మించిన జాబ్ ఆఫర్స్ ఇక్కడే

స్టూడెంట్లకు భారీ జీతాలు
ఐఐటీ ప్లేస్‌ మెంట్స్‌‌లో పెరిగిన వేతనాలు
రూ.70–80 లక్షల ప్యాకేజ్ కిందటేడాదితో పోలిస్తే 35 శాతం ఎక్కువ

కోల్‌‌కతా: మంచి జీతం వస్తుందని ఎక్కడో విదేశాలకు వెళ్లి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల ప్లేస్‌‌మెంట్స్‌‌లో విదేశాలలో ఆఫర్ చేసే  అమౌంట్​ కంటే ఎక్కువ శాలరీలను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. మొట్టమొదటిసారి ఇండియాలో జాబ్స్ శాలరీలు కిందటేడాదితో పోలిస్తే 30–35 శాతం పెరిగాయి. గ్లోబల్‌‌గానే ఇవి బెస్ట్ శాలరీలుగా నిలుస్తున్నాయి. ఐఐటీ మద్రాస్, ఐఐటీ రూర్కే, ఐఐటీ గౌహతి వంటి ఐఐటీల విద్యార్థులకు బెస్ట్ పేయింగ్ ప్యాకేజ్‌‌లను టాప్ ఇంటర్నేషనల్ సంస్థలు ఆఫర్ చేశాయి. కొత్తగా బయటికి వచ్చే గ్రాడ్యుయేట్లు ఎక్కడికో విదేశాలకు వెళ్లకుండానే ఇండియా నుంచే పెద్ద మొత్తంలో జీతాలను పొందే అవకాశం కల్పిస్తున్నాయి. చాలా స్కిల్స్‌‌లో వర్క్ ఫ్రమ్ హోమ్‌‌కే డిమాండ్ ఉంటుంది. కరోనా మహమ్మారితో మైక్రోసాఫ్ట్, ఉబర్ వంటి సంస్థలు ఈ ఏడాది తమ ఇంటర్నేషనల్ క్యాంపస్‌‌లను ఇంకా ఓపెన్  చేయలేదు. ఎంటీఎక్స్ గ్రూప్, క్వాంట్‌‌బాక్స్ రీసెర్చ్ అండ్ గ్రావిటన్‌‌ వంటి కంపెనీలు ఇండియాలో పోస్టింగ్స్‌‌కి ఏడాదికి రూ.70–80 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేశాయి. కిందటేడాది ఈ శాలరీలు ఏడాదికి రూ.45–62 లక్షలుగానే ఉన్నట్టు ఇన్‌‌స్టిట్యూట్స్ చెబుతున్నాయి. ఐఐటీ రూర్కేలో అత్యధికంగా రూ.80 లక్షలతో ఇండియాలో ప్యాకేజీని కంపెనీలు ఆఫర్ చేశాయి.  ఇంటర్నేషనల్‌‌గా అత్యధిక ఆఫర్ రూ.69 లక్షలతో పోలిస్తే ఇది 16 శాతం ఎక్కువగా ఉంది. కిందటేడాదితో పోలిస్తే 28 శాతం ఎక్కువగానే ఈ ప్యాకేజ్ ఉంది. అంతకుముందు ఏడాది డొమెస్టిక్ ఆఫర్ రూ.62.28 లక్షలుగానే ఉంది. మొట్టమొదటిసారి దేశీయంగానే విదేశాల కంటే మించిన ఆఫర్లు విద్యార్థులకు దక్కినట్టు ఐఐటీ రూర్కే చెప్పింది.

స్కిల్స్‌‌కే తొలి ప్రాధాన్యం..

ఐఐటీ రూర్కేతో పాటు, ఐఐటీ గౌహతిలో కూడా టాప్ డొమెస్టిక్ ఆఫర్ రూ.70 లక్షలుగా ఉంది. ఇది కిందటేడాది ఆఫర్ చేసిన రూ.52 లక్షల కంటే 35 శాతం ఎక్కువగా ఉంది. ఈ ఏడాది హయ్యస్ట్ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ 1,25,000 సింగపూర్ డాలర్స్(రూ.69 లక్షలుగా) ఉంది. ఐఐటీ మద్రాస్‌‌లో కూడా తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ఆఫర్ చేసిన టాప్ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ కంటే కూడా ఎక్కువగా ఎంటీఎక్స్ గ్రూప్ లోకల్‌‌గా అందించిందని అడ్వయిజర్(ట్రైనింగ్ అండ్ ప్లేస్‌‌మెంట్) సీఎస్ శంకర్ రామ్ చెప్పారు. ఐఐటీ కాన్పూర్‌‌‌‌లో హయ్యస్ట్ డొమెస్టిక్ ఆఫర్ రూ.82 లక్షలుగా ఉంది. ఇది కిందటేడాది రూ.62 లక్షలుతో పోలిస్తే 32 శాతం ఎక్కువ. గ్లోబల్ క్లౌడ్ ఇంప్లిమెంటేషన్ పార్టనర్ ఎంటీఎక్స్ గ్రూప్ ఎంటీఎక్స్ ఇండియా కోసం ఐఐటీ స్టూడెంట్లను నియమించుకుంది. స్టూడెంట్లకు ఉన్న నైపుణ్యాల ఆధారంగా తాము ప్యాకేజ్‌‌లను ఆఫర్ చేశామని, లొకేషన్‌‌ను పరిగణనలోకి తీసుకోలేదని ఎంటీఎక్స్ చీఫ్ పీపుల్ ఆఫీసరు అంకిత సిన్హా అన్నారు. కరోనా టైమ్‌‌లో గ్లోబల్ పే చెల్లింపుల మధ్యనున్న అంతరాయాలు దాదాపు తొలిగిపోయాయని భావిస్తున్నట్టు చెప్పారు.

ఐఐటీ ప్లేస్‌‌మెంట్స్‌‌లో 30–35 శాతం పెరిగిన దేశీయ శాలరీలు  

ఎంటీఎక్స్ గ్రూప్, క్వాంట్‌‌బాక్స్ వంటి కంపెనీలు ఇండియాలోనే రూ.70–80 లక్షలు ఆఫర్

కొన్ని ఐఐటీల్లో విదేశాల్లో ఆఫర్ చేసే కంటే ఎక్కువ డొమెస్టిక్ ప్యాకేజ్

లొకేషన్‌ సమస్యే కాదు..
క్యాంపస్ వర్గాల సమాచారం మేరకు క్వాం ట్‌ బాక్స్ డొమెస్టి క్ జాబ్స్‌ కు పర్‌ ఫార్మెన్స్ బోనస్‌‌తో పాటు రూ .80 లక్షల ప్యాకేజ్‌ ను ఆఫర్ చేసింది. లొకేషన్‌ దీనికసలు సమస్యే కా లేదు. ‘టెక్ ట్రేడింగ్ సంస్థగా ఉండాలంటే.. భౌగోళిక ఆంక్షలు పె ట్టుకోకుండా బిజినెస్‌‌ను కొనసాగించాల్సి ఉంటుం ది’ అని క్వాంట్‌బా క్స్ చెప్పిం ది. కరోనా కా లంలో జరిగిన ఈ ఐఐటీ ప్లేస్‌‌మెంట్ సీజన్‌ ను ఇటు స్టూడెంట్లు, అటు కంపెనీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కంపెనీలు డొమెస్టిక్ రోల్స్‌ కు కూడా ఎక్కువ వేతనాలను ఆఫర్ చేయడాన్ని తాము గుర్తించామని, ముఖ్యంగా క్లౌడ్‌ లో ఇది ఎక్కువగా ఉందని ఐఐటీ గౌహతి డైరెక్టర్ టీజీ సీతారామ్ అన్నారు. కరోనా మహమ్మారితో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు కొత్త ఫార్ములాగా తెరపైకి వచ్చింది. కొన్ని కంపెనీలు క్యాంపస్‌‌ల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం టాలెంట్‌ ను నియమించుకుంటున్నాయి.

For More News..

కొత్త సబ్‌‌స్క్రయిబర్ల కోసం ఓటీటీ ప్లాన్స్​