
హైదరాబాద్, వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ కు 35 పోస్టులను మంజూరుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ విధానంలో 30, ఔట్‌సోర్సింగ్‌లో 5 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పోస్టులను భర్తీ చేసుకోవచ్చంది. ప్రిన్సిపల్–1, జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్–1, పీజీటీ–7, టీజీటీ–9, పీడీ–1, పీఈటీ–1, క్రాఫ్ట్/ఆర్ట్/మ్యూజిక్ టీచర్–1, సీనియర్ అసిస్టెంట్–1, స్టాఫ్‌నర్స్–1 పోస్టులను రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఆఫీసు సబార్డినేట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఐసీటీ ఇన్ స్ట్రక్టర్, ల్యాబ్ అటెండర్ పోస్టులను ఔట్సోర్సింగ్పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.