అమరుల ఫ్యామిలీలకు జాబులియ్యాలె

అమరుల ఫ్యామిలీలకు జాబులియ్యాలె

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆర్టీసీ ఉద్యమంలో అమరులైన కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియాతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నేషనల్‌‌‌‌‌‌‌‌ మజ్దూర్‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర అధ్యక్షుడు కమాల్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ప్రభుత్వం ఆర్టీసీకి వెంటనే వెయ్యి కోట్ల సాయం అందించాలని కోరారు. కార్మికుల బలిదానాలు, 47 రోజుల సుదీర్ఘ సమ్మె, సుమారు 400 కోట్ల ఆర్థిక నష్టం తర్వాత ఆర్టీసీ జేఏసీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు.

ఆర్టీసీ సమ్మెకు నేషనల్ మజ్దూర్ యూనియన్ సంపూర్ణ సహకారం అందించిందని చెప్పారు. న్యాయస్థానం సూచన మేరకు ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేరేందుకు ఆర్టీసీ యాజమాన్యం అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక శ్రేయస్సు, సంస్థ పరిరక్షణ కోసం ఎన్‌‌‌‌‌‌‌‌ఎంయూ యాక్షన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ రెడీ చేస్తోందన్నారు.

మరిన్ని వార్తల కోసం