మిస్ వరల్డ్గా జోహెయిర్రీ మోలా.. డొమినికన్ రిపబ్లిక్ భామకు కిరీటం

మిస్ వరల్డ్గా జోహెయిర్రీ మోలా.. డొమినికన్ రిపబ్లిక్ భామకు కిరీటం

న్యూ ఢిల్లీ:  వియత్నాంలో జరిగిన మిస్‌‌ వరల్డ్‌‌ 2026 పోటీల్లో డొమినికన్‌‌ రిపబ్లిక్‌‌కు చెందిన జోహెయిర్రీ మోలా డొమింగ్వెజ్‌‌ ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 111 మంది పోటీదారులు పాల్గొన్న ఈ పోటీలో తుది దశకు చేరుకున్న ఆరుగురిలో మోలా విజేతగా నిలిచారు. గత ఏడాది మిస్‌‌ వరల్డ్‌‌గా నిలిచిన థాయ్‌‌లాండ్‌‌ భామ ఒపల్‌‌ సుచాతా చువాంగ్‌‌స్రీ ఆమెకు కిరీటం అలంకరించారు.

ఇండియా తరఫున మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న నిఖితా పొర్వాల్  టాప్ 40 వరకు చేరుకున్నప్పటికీ, టాప్ 20 జాబితాలో స్థానం దక్కించుకోలేకపోయారు.

కాంటెస్ట్ వివరాలు: 

విన్నర్: జోహెర్రీ మోలా (డొమినికన్ రిపబ్లిక్)
మొదటి రన్నర్ అప్: ఎలిజబెత్ రైనెస్ (స్పెయిన్)
రెండో రన్నర్ అప్: తనుసియ చెట్టి (మలేషియా)
వేదిక: న్హా ట్రాంగ్, వియత్నాం