
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల కానుంది. ఇందులో షారూఖ్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. జాన్ అబ్రహం ఈ మూవీలో భయంకరమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా జాన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ వదిలారు మేకర్స్.
ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన షారుఖ్, దీపిక ఫస్ట్ లుక్ లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన జాన్ అబ్రహాం పాత్ర ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. యశ్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. 'పఠాన్' జనవరి 25న విడుదల కానుంది.
.@TheJohnAbraham is ready to get the fire started in #Pathaan ? Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you on 25th January, 2023. Releasing in Hindi, Tamil and Telugu. pic.twitter.com/QeGN1sWhPS
— Yash Raj Films (@yrf) August 25, 2022