కాగజ్ నగర్, వెలుగు: గుంతల మయంగా మారిన రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు రోడ్లను బాగు చేయాలని స్టూడెంట్లు రాస్తారోకో చేపట్టారు. స్కూల్ విద్యార్థులు మంగళవారం ఉదయం పెంచికల్ పేట్ మండలం నుంచి సలుగుపల్లికి వెళ్లే ప్రధాన రోడ్డుసై కూర్చొని ఆందోళన చేశారు. ఆటోల్లో స్కూళ్లకు వెళుతున్న తమకు గుంతల రోడ్లతో ఇబ్బందులు పడుతున్నామని, రోడ్లను వెంటనే బాగుచేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే హరీశ్ బాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వారికి ఆటో యూనియన్ నాయకులు మద్దతు తెలిపారు.
