జైలులో సూసైడ్ చేసుకున్న మెకాఫీ యాంటీవైరస్ సృష్టికర్త 

జైలులో సూసైడ్ చేసుకున్న మెకాఫీ యాంటీవైరస్ సృష్టికర్త 
  • ట్యాక్స్ ఎగవేత కేసులో అరెస్ట్
  • ప్రస్తుతం బార్సిలోనా జైలులో ఉన్న మెకాఫీ
  • జైలు గదిలో ఉరేసుకొని ఆత్మహత్య

ప్రముఖ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ మెకాఫీని సృష్టించిన జాన్ మెకాఫీ (75) బుధవారం బార్సిలోనా జైలులోని తన సెల్‌లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆయన ఆత్మహత్యను న్యాయ శాఖ ధృవీకరించింది. మెకాఫీ 2014 మరియు 2015 సంవత్సరాలకు గాను పన్నులు చెల్లించనందున గత ఏడాది అక్టోబర్‌లో ఆయనను అరెస్టు చేశారు. ఆ కేసుకు సంబంధించి ఆయన బార్సిలోనా జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే పన్ను ఎగవేత కేసులో భాగంగా ఆయనను అమెరికాకు అప్పగించాలని స్పానిష్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలు వచ్చిన కొన్ని గంటల్లోనే మెకాఫీ సూసైడ్ చేసుకోవడం గమనార్హం. ఆయన అమెరికా కోర్టులో దోషిగా తేలితే జీవితాంతం జైలు జీవితం గడపాల్సి వస్తుంది. అది ఇష్టం లేని మెకాఫీ.. అందుకే సూసైడ్ చేసుకున్నాడని సమాచారం.

మెకాఫీ 1987లో మెకాఫీ సంస్థలను ప్రారంభించాడు. ఆయన కనిపెట్టిన మెకాఫీ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ 1980 మరియు 1990లలో బాగా ప్రాచుర్యం పొందింది. కాగా.. జాన్ 2010లో మెకాఫీ సంస్థలను ఇంటెల్‌కు విక్రయించాడు.