గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలి : ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి

గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలి : ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి
  • ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి

షాద్ నగర్, వెలుగు: క్రీడాకారులకు తన వంతు మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. షాద్ నగర్​లో యువ నేత నందరం అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్​తో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. 

పోటీల్లో 70 జట్లు పాల్గొనడం ఆనందకరమని, గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. గ్రామీణ క్రీడాకారులు తమ సత్తా చాటడానికి ఇటువంటి వేదికలు ఎంతగానోఉపయోగపడుతాయన్నారు.