అమెరికాలో ఇండియన్ జర్నలిస్ట్ దుర్మరణం

అమెరికాలో ఇండియన్ జర్నలిస్ట్ దుర్మరణం
  • ఈ-బైక్​ బ్యాటరీ పేలి బిల్డింగ్​లో చెలరేగిన మంటలు
  • జర్నలిస్ట్​ ఫాజిల్ ఖాన్ సజీవ దహనం

న్యూయార్క్: అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో మనదేశానికి చెందిన 27 ఏండ్ల జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. ఆరంతస్తుల భవనంలోని పార్కింగ్​లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి బిల్డింగ్ అంతటా మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకుని జర్నలిస్ట్ ఫాజిల్ ఖాన్ చనిపోయాడు. గాయపడిన 17 మందిని ఫైర్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి కండిషన్ సీరియస్​గా ఉందని తెలిపారు.

మంటలు గమనించిన కొందరు ఐదో అంతస్తు కిటికీల్లోంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారని చెప్పారు. మన్​హట్టన్  హార్లెమ్​లోని సెయింట్ నికోలస్ ప్రాంతంలో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొలంబియా జర్నలిజం స్కూల్​లో చదివిన ఫాజిల్ ఖాన్.. ప్రస్తుతం ‘ది హెచింగర్ రిపోర్ట్‌‌’ అనే మీడియా సంస్థలో జర్నలిస్ట్​గా పనిచేస్తున్నారు.  ఫాజిల్ ఖాన్ మృతిపట్ల న్యూయార్క్​లోని ఇండియన్ ఎంబసీ సంతాపం వ్యక్తం చేసింది. ఇండియాలో ఉన్న అతని కుటుంబ సభ్యులతో టచ్​లో ఉన్నామని, వీలైనంత తొందరలో డెడ్​బాడీని తరలిస్తామని ట్వీట్ చేసింది.