జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలి : ప్రెసిడెంట్ పి.రాంచందర్

జర్నలిస్టులకు ఇండ్ల  స్థలాలివ్వాలి : ప్రెసిడెంట్ పి.రాంచందర్
  •  అందరికీ అక్రెడిటేషన్లు అందేలా చూడాలి 
  •  కలెక్టరేట్ వద్ద హెచ్ యూజే ఆధ్వర్యంలో నిరసన 

హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి.రాంచందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ పిలుపులో భాగంగా సోమవారం హెచ్ యూజే ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు నిర సన తెలిపారు.  ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ హామీ మేరకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, సబ్ కమిటీ పేరుతో కాలయాపన చేయడం తగదన్నారు. అందరికీ అక్రెడిటేషన్లు అందేలా చూడాలని కోరారు. 

15న  ఐఅండ్ పీఆర్ కమి షనరేట్​వద్ద నిర్వహించే మహా ధర్నాకు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. హెచ్ యూజే అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్​కుమార్​, బి.జగదీశ్వర్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల  బస్ పాస్ లకు సంబంధించి1/3 ఫేర్ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు. ఆర్టీసీ బస్సుల్లో, మెట్రోలో  ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. హెచ్ యూజే వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, ట్రెజరర్​ బి.రాజశేఖర్, డీజేఎఫ్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మస్తాన్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.నిరంజన్ పాల్గొన్నారు. 

మల్కాజ్ గిరి: మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళనలో రాష్ట్ర నాయకులు ఎస్ కె.సలీమా, గుమ్మడి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు మల్లేశ్​గౌడ్, కార్యదర్శి బనావత్ రవి నాయక్ పాల్గొన్నారు. తర్వాత కలెక్టర్ కు వినతి పత్రం  అందజేశారు.