హైదరాబాద్ సిటీ, వెలుగు: చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో బుధవారం గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (జీహెచ్ జే) సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగింది. సుప్రీం తీర్పుతో, అక్రిడిటేషన్‌తో సంబంధం లేకుండా గ్రేటర్ పరిధిలోని అన్ని కేటగిరీల జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో 200 చదరపు గజాల ఇండ్ల స్థలాలు కేటాయించాలని తీర్మానించడంతో పాటు సీఎంకు విజ్ఞప్తి చేశారు.
సోమయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా.. జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై క్లారిటీ ఇవ్వడం లేదని, మొన్నటి కేబినెట్ సమావేశం, తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా సీఎం ప్రసంగంలో ప్రస్తావన లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లీడర్నైశిదం సత్యనారాయణ మూర్తి, తెలంగాణ జనసమితి గ్రేటర్ బీసీ సెల్ అధ్యక్షుడు జశ్వంత్, సీనియర్ జర్నలిస్టులు తీగవరపు శాంతి, నాగవాణి
పాల్గొన్నారు.
