ఇందిర జైల్లో పెట్టిన నేతలే.. రాహుల్​ను స్వాగతిస్తున్నరు

ఇందిర జైల్లో పెట్టిన నేతలే.. రాహుల్​ను స్వాగతిస్తున్నరు
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా

భవానీపట్న: పాట్నాలో శుక్రవారం జరిగిన విపక్షాల భేటీపై బీజేపీ చీఫ్​ నడ్డా విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ.. దేశంలో ఎమర్జెన్సీ విధించిన టైంలో జైలుకు వెళ్లిన నేతలే ఇప్పుడు ఆమె మనవడు రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఒడిశాలోని కలహండి జిల్లా భవానీపట్నలో జరిగిన బహిరంగ సభలో నడ్డా మాట్లాడుతూ.. ఈ రోజు రాజకీయాల్లో విచిత్రాలు జరుగుతున్నా యన్నారు.

నితీశ్ నిర్వహించిన విపక్షాల సమావేశానికి లాలూ హాజరైన విషయాన్ని నడ్డా ప్రస్తావించారు. వీరిద్దరూ ఎమర్జెన్సీ టైంలో జై ప్రకాశ్​ నారాయణ్ ఉద్యమం లో స్టూడెంట్​ లీడర్లుగా ఉన్నప్పుడు అరెస్టయ్యారని తెలిపారు. లాలూ 22 నెలలు, నితీశ్​ 20 నెలల పాటు జైలుకు వెళ్లారని చెప్పారు.