బీజేపీ పాలనలో పేదలకు ఉచితంగా విద్య, వైద్యం: జేపీ నడ్డా

బీజేపీ పాలనలో పేదలకు ఉచితంగా విద్య, వైద్యం: జేపీ నడ్డా

పేదల ఆరోగ్యంపై తమ ప్రభుత్వానికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. గుజరాత్ దాహోద్ లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడారు. 50 కోట్ల మందికి 5 లక్షల రూపాయల ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నామన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్ గుర్తొస్తుందన్నారు. బీజేపీ పాలనలో విద్య, వైద్యం పేదలకు ఉచితంగా లభిస్తున్నాయని చెప్పారు. 

మరోవైపు వడోదర బహిరంగ సభలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఆ తర్వాత గోద్రాలో రోడ్ షో నిర్వహించారు. చివరి రోజు ఎన్నికల ప్రచారం కావడంతో మొత్తం 11 మంది ముఖ్యనేతలు రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు.