హైదరాబాద్, వెలుగు: విమాన ప్రయాణికులకు అధునిక వసతి అందించడానికి జెపాడ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లోని జీఎంఆర్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త పాడ్ హోటల్‌ను ప్రారంభించింది. బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, ట్రావెలర్స్ కు అందుబాటులో ఉంటుంది.
సంప్రదాయ విమానాశ్రయ లాంజ్‌లు, హోటళ్లతో పోల్చితే ధర తక్కువని జేపాడ్ తెలిపింది. ప్రతి పాడ్‌లో సురక్షితమైన స్టోరేజ్, ఎంటర్టైన్మెంట్, వైఫై ఉంటాయి. ఈ సందర్భంగా జీహెచ్‌ఐఏఎల్ సీఈవో ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ బిజీగా ఉండే ప్రయాణికులకు ఇలాంటి పాడ్హోటల్స్ ఎంతో అనువుగా ఉంటాయని చెప్పారు.