విలన్ కాదు ఏజెంట్.. ఎన్టీఆర్ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ న్యూస్

విలన్ కాదు ఏజెంట్.. ఎన్టీఆర్ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ న్యూస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం చేస్తున్న సినిమాలపై రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఓపక్క దేవర(Devara).. మరోపక్క బాలీవుడ్ వార్(War) మూవీ. ఈ రెండు సినిమాలతో ఫుల్ ట్రేండింగ్ లో ఉంటున్నారు ఎన్టీఆర్. ఇక తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ వార్2(War2) గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ వార్ సినిమాకు సీక్వెల్ గా వార్2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హృతిక్ రోషన్(Hrithik roshan), ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. సిద్దార్థ్ ఆనంద్(Siddarth anand) దర్శకత్వంలో రానున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పై ఆడియన్స్ లో ఒక రేంజ్ లో అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి గతకొంత కాలంగా రూమర్స్ క్రియేట్ అవుతూనే ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటీవ్(విలన్) పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. 

తాజా సమాచారం ప్రకారం వార్2 సినిమాలో ఎన్టీఆర్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడట. ధూమ్(Dhoom) సినిమాలో అభిషేక్ బచ్చన్(Abhishek bachhan) చేసిన పాత్రలో లా ఉండనుందట ఎన్టీఆర్ పాత్ర. దీంతో వార్2 పై వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన కొరటాల శివ(Karatala Shiva) దర్శకత్వంలో దేవర అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.