అగ్ని తుఫాన్ రాబోతోంది.. ఓజీ నుండి సాలీడ్ అప్డేట్

అగ్ని తుఫాన్ రాబోతోంది.. ఓజీ నుండి సాలీడ్ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) హీరోగా చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ(OG). టాలీవుడ్ స్టైలీష్ డైరెక్టర్ సిజీత్(Sujeeth) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పవన్ నుండి వస్తున్న సినిమాల్లో ఓజీ సినిమాకు సెపరేట్ క్రేజ్ ఏర్పడింది. దానికి కారణం ఈ సినిమాలో పవన్ మొదటిసారి గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నారు. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రేండింగ్ లోకి వస్తోంది. 

ఇక తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పవన్ ఫ్యాన్స్ ఓజీ సినిమా అప్డేట్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న నేపధ్యంలో.. మేకర్స్ వాళ్లకి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే.. ఈ సినిమా నుండి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టినరోజు సందర్బంగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేయనున్నారు. ఈ విషయం తెల్సుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

ALSO READ :బొమ్మరిల్లు భాస్కర్‌తో.. సిద్దూ నెక్స్ట్‌ సినిమా ఫిక్స్

అయితే.. ఈ సినిమా షూటింగ్ నుండి ఇప్పటికే కొన్ని పిక్స్ లీకవగా.. అవి కాస్త క్షణాల్లో ట్రేడ్ అయ్యాయి. కేవలం లీకుడ్ పిక్స్ తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాంటిది అఫీషియల్ పిక్ రిలీజ్ అయితే ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో అని చేర్చించుకుంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇవన్నీ చూస్తుంటే.. సెప్టెంబర్ 2న సోషల్ మీడియాలో బీభత్సం ఖాయంగా కనిపిస్తోంది.