ఎన్టీఆర్‌ జిమ్లో ఇంతలా కష్టపడుతున్నాడంటే.. ‘డ్రాగన్‌‌’లో నీల్ ప్లాన్ చేసిన సీన్ ఇదేనా..?

ఎన్టీఆర్‌ జిమ్లో ఇంతలా కష్టపడుతున్నాడంటే.. ‘డ్రాగన్‌‌’లో నీల్ ప్లాన్ చేసిన సీన్ ఇదేనా..?

ఎన్టీఆర్‌‌‌‌ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో  ఓ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నాడు ఎన్టీఆర్. ఇందుకు సంబంధించి జిమ్‌‌లో ఎన్టీఆర్‌‌‌‌ వర్కవుట్స్‌‌ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో ఇంతలా కష్టపడుతున్నాడంటే ‘డ్రాగన్’లో ప్రశాంత్ నీల్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని భావిస్తున్నారు. 

ఎన్టీఆర్తో నీల్ ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశాడని.. ‘డ్రాగన్’ సినిమాకే ఇది హైలైట్గా నిలుస్తుందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే సోమవారం హైదరాబాద్‌‌లోని అమెరికా కాన్సులేట్‌‌కు వెళ్లాడు ఎన్టీఆర్.  అమెరికా కాన్సుల్‌‌ జనరల్‌‌ లారా విలియమ్స్‌‌ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

‘‘అమెరికా కాన్సులేట్‌‌కు వచ్చిన ఎన్టీఆర్‌‌‌‌ను స్వాగతించడం ఆనందంగా ఉంది. యూనైటెడ్‌‌ స్టేట్స్‌‌లో చిత్రీకరించనున్న తన కొత్త సినిమాలు.. ఉద్యోగాల కల్పనతో పాటు  ఇండియా, అమెరికా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నాయి” అని చెబుతూ ఎన్టీఆర్‌‌‌‌తో కలిసి దిగిన ఫొటోలను ఆమె షేర్ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్‌‌ అమెరికాలో జరగబోతోందని అర్థమవుతోంది. ఇందుకు సంబంధించిన వీసా అనుమతుల కోసం తారక్ యూఎస్‌‌ కాన్సులేట్‌‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌‌‌‌ ఆర్ట్స్‌, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్‌‌’ అనే టైటిల్‌‌ పరిశీలనలో ఉంది.