యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.కాదు కాదు ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఓ వైపు దేవర ప్రమోషన్స్ తో, మరోవైపు దేవర ఓవర్సీస్ లెక్కలతో దూసుకుపోతున్నాడు. అయితే ఇపుడు మనం మాట్లాడుకోబోయేది ఎన్టీఆర్ సినిమా గురించి కాదు. ఈయన వేసుకున్న షూ గురించి. ప్రస్తుతం ఎన్టీఆర్ వేసుకున్న షూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్‌కు డిజిటల్ మీడియాలో అలాంటి ఇమేజ్ ఉంది మరి.
సోమవారం సెప్టెంబర్ 9న ఎన్టీఆర్, టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga)వంగా ముంబైలో కలుసుకున్న విషయం తెలిసిందే. వీరి కలయికకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఇందులో భాగంగానే నెటిజన్స్ దృష్టికి ఎన్టీఆర్ వేసుకున్న షూ తారసపడింది.
అదేనండి.. ఈ ఫొటోలో ఎన్టీఆర్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్న స్టైలిష్ షూ వేసుకొని ఉన్నాడు. విదేశాలకు చెందిన బ్రాండెడ్ Balenciaga అనే కంపెనీ షూ అది. దీంతో ఈ షూస్ ధర ఎంతనే చర్చ మొదలైంది. అభిమనులు, నెటిజనులు ఆ షూ ధర సోషల్ మీడియాలో వెతకడం మొదలు పెట్టారు.
ఈ కంపెనీ షూస్ స్టార్టింగ్ ధరే ఆల్మోస్ట్ 40 వేలకు పైగా ఉంది. ఈ బ్రాండ్ లో లక్ష రూపాయల పైన ఉన్న షూస్ కూడా ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ వేసుకున్న మోడల్ షూస్ ధర 995 డాలర్లు ఉంది. అంటే మన రూపాయల్లో ఆల్మోస్ట్ 80 వేల రూపాయలకు పైనే.. ఆ ధర తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంత ఖరీదైన షూట్ తారక్ వాడుతున్నాడా? అంటూ అంతా చర్చించుకుంటున్నారు.
అయితే మన సెలబ్రిటీల దగ్గర ఇలాంటి కాస్ట్లీ ఐటమ్స్ చాలానే ఉంటాయి. ఎన్టీఆర్ దగ్గర లక్షల్లో, ఏకంగా కోట్లల్లో విలువ చేసే వాచ్ లు కూడా ఉన్నాయి. వాటితో పోలిస్తే ఈ షూస్ ధర ఎన్టీఆర్ కి చాలా తక్కువే అని అనుకుంటున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ రాజసం ముందు తన లెగ్జరీ ఐటమ్స్ చాలా తక్కువే అనిపిస్తోంది.
EXCLUSIVE: #Devara Trailer launch, #NTRJr X #SandeepReddyVanga in Mumbai🔥🔥🔥🔥💣💣💣#1MUsaPreSalesForDeavara@DevaraMovie #DevaraOnSept27th #NTR𓃵 pic.twitter.com/t6DwHabZjq
— Jr NTR (@TarakUmesh9999) September 9, 2024