ధర్మగిరి సాయిబాబా సేవలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి

ధర్మగిరి సాయిబాబా సేవలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి
  • కోరిక తీరడంతో మొక్కు చెల్లించుకున్న నవీన్ యాదవ్

శంషాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు టికెట్ దక్కడంతో శుక్రవారం శంషాబాద్​లోని ధర్మగిరి సాయిబాబాను నవీన్ యాదవ్ దర్శించుకున్నారు. ధర్మగిరి సాయిబాబా భక్తుడైన నవీన్ యాదవ్ తరచూ ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. 

ఇటీవల జూబ్లీహిల్స్ టికెట్ కోసం బాబా హుండీలో ఆయన చీటీ రాసి వేశారు. కోరిక తీరడంతో స్వామివారిని దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నట్లు ఆలయ ధర్మకర్త శివసాయి దత్తు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయన పేరు పై శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.