
హైదరాబాద్: ఉప ఎన్నిక జరగనున్న జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఫైనల్ఓటర్ లిస్టును మంగళవారం (సెప్టెంబర్30)ప్రకటించారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్.
కొత్త లిస్టు ప్రకారం.. మొత్తం ఓటర్లు 3లక్షల 98వేల 982 ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 2లక్షల 7వేల 367 ఉండగా.. మహిళా ఓటర్లు 1లక్షా 91వేల 590, ట్రాన్స్ జెండర్లు 25 ఉన్నారు. గత ఎన్నికల తర్వాత కొత్తగా 6వేల 313 మంది ఓటర్లుగా నమోదు అయ్యారు.