జనవరి 3 నుంచి టెట్.. 9 రోజుల పాటు 15 సెషన్లలో ఆన్ లైన్ ఎగ్జామ్స్

జనవరి 3 నుంచి టెట్.. 9 రోజుల పాటు 15 సెషన్లలో ఆన్ లైన్ ఎగ్జామ్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పూర్తి స్థాయి షెడ్యూల్​ రిలీజ్ అయింది. వచ్చేనెల జనవరి 3 నుంచి 20 వరకు ఆన్​లైన్​లో పరీక్షలు నిర్వహించనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్​మంగళవారం ప్రకటించింది. జనవరి 3, 4, 5, 6, 8, 9, 11, 19, 20 తేదీల్లో పరీక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. మొత్తం 9 రోజుల పాటు15 సెషన్లలో ఎగ్జామ్స్ ఉండనున్నాయి. ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్​ కొనసాగుతాయి. మొదటి షిష్ట్ లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, సెకండ్ షిఫ్ట్ లో​ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కాగా, సబ్జెక్టుల వారీగా షెడ్యూల్​ కోసం https://schooledu.telangana.gov.in వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ చూడాలని సూచించారు. కాగా, ఈ సారి టెట్​కు మొత్తం 2,37,754 దరఖాస్తులు వచ్చాయి. గత టెట్‌‌‌‌‌‌‌‌లో 1,83,653 అప్లికేషన్లు రాగా.. ఈ సారి ఏకంగా 54,101 దరఖాస్తులు అదనంగా వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల్లో పేపర్- 2 (స్కూల్ అసిస్టెంట్) కోసం అత్యధికంగా 1,52,216 మంది అప్లై చేసుకోగా.. పేపర్-1 (ఎస్జీటీ) కోసం 85,538 మంది దరఖాస్తు చేశారు. దీనిలో  71,670 మంది ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారు. 

ఇదీ పరీక్షల షెడ్యూల్..

జనవరి 3, 4: పేపర్-2 
(మ్యాథమెటిక్స్ అండ్  సైన్స్)
జనవరి 5, 6: పేపర్-2 (సోషల్ స్టడీస్) 
జనవరి 8, 9, 11: పేపర్-1 (ఎస్జీటీ అభ్యర్థులకు) 
జనవరి 19:  పేపర్-1 (మైనర్ మీడియం, - బెంగాలీ, హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, మరాఠి) 
జనవరి 20: పేపర్- 2 
(మైనర్ మీడియం–- మ్యాథ్స్, సైన్స్, సోషల్)