జూబ్లీహిల్స్ లో భూ కబ్జా యత్నం... ఇద్దరు సినీ నిర్మాతలపై కేసు...

జూబ్లీహిల్స్ లో భూ కబ్జా యత్నం... ఇద్దరు సినీ నిర్మాతలపై కేసు...

జూబ్లీహిల్స్ లో భూ కబ్జా యత్నం వ్యవహారంపై ఇద్దరు సినీ నిర్మాతలపై కేసు నమోదయ్యింది. టాలీవుడ్ నిర్మాతలు సి కళ్యాణ్, బూరుగుపల్లి శివరామకృష్ణలపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాపారవేత్త కాంతమనేని రవిశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.

జూబ్లీహిల్స్‌లోని ఉమెన్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన ప్లాట్ నం. 89 వివాదాస్పద స్థలమని.. ఆ స్థలంపై కోర్టులో కేసు పెండింగ్‌ లో ఉండగా, జూన్ 10న కోర్టు రవిశంకర్ స్వాధీనంలో ఉన్న భూమి పై జోక్యం చేసుకోవద్దని తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీ చేసినట్లు తెలిపారు పోలీసులు. 

కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ నిందితులు స్థలంలోకి అక్రమంగా ప్రవేశించారని ఫిర్యాదులో పేర్కొన్నారు రవిశంకర్. తాళాలు పగులగొట్టి, గేటును ధ్వంసం చేసి, అక్కడి సామగ్రిని చెల్లాచెదురు చేశారన్నారు రవిశంకర్. సిబ్బందిని బెదిరించి, అక్కడ నిర్మించిన గదిని కూడా ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితుడు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.