జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. నవంబర్ 11న పోలింగ్ ..14 కౌంటింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓటర్లకు కీలక సూచనలు చేశారు ఎన్నికల అధికారులు. ఓటర్ స్లిప్ ను గుర్తింపు కార్డు కింద పరిగణించమని..అది కేవలం పోలింగ్ కేంద్రం వివరాలు తెలియజేసేందుకు మాత్రమే అని చెప్పారు.
ఓటర్లు ఏదైనా ఫోటో ఐడీ కార్డు పోలింగ్ బూత్ లో చూపించి ఓటు వేయాలని చెప్పారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు లిస్ట్ లో పేరుండి... ఓటరు గుర్తింపు కార్డుతో పాటు ఈసీ గుర్తించిన 12 ప్రత్యామ్నాయ ఫోటో ఐడిలలో దేనినైనా ఒకటి పోలింగ్ సిబ్బందికి చూపి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని సూచించారు అధికారులు.
ఈసీ గుర్తించిన 12 కార్డులివే
1. ఆధార్
2. ఉపాధిహామీ జాబ్ కార్డు
3. బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్ బుక్
4. కేంద్ర కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు లేదా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్
5. డ్రైవింగ్ లైసెన్స్
6. పాన్ కార్డు
7. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కింద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డు
8. పాస్ పోర్ట్
9. ఫొటోతో కూడిన పెన్షన్ పత్రాలు
10. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్ యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు
11. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అఫీషియల్ ఐడెంటిటీ కార్డులు
12. కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజేబుల్ కార్డు
