పేద స్టూడెంట్స్కు అండగా గ్రామ స్వరాజ్య సంస్థ

పేద స్టూడెంట్స్కు అండగా గ్రామ స్వరాజ్య సంస్థ
  • జడ్జీ మెండు రాజమల్లు 
  • సంస్థ ఆధ్వర్యంలో 200 మంది స్టూడెంట్స్​కు​ సైకిల్స్​ పంపిణీ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పేద స్టూడెంట్స్​ అండగా గ్రామ  స్వరాజ్య సంస్థ ఉందని స్పెషల్​ జ్యుడీషియల్​ సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్​ మెండు రాజమల్లు పేర్కొన్నారు. చుంచుపల్లి మండలంలోని రాంనగర్​లోని గ్రామ స్వరాజ్య సంస్థ జిల్లా ఆఫీస్​లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో పేద స్టూడెంట్స్​కు ఆయన సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆకాంక్షించారు. 

గ్రామ స్వరాజ్య సంస్థ  గవర్నమెంట్​ స్కూళ్లలో చదువుతూ దూరాభారంతో ఇబ్బంది స్టూడెంట్స్​కు సైకిల్స్​ పంపిణీ చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఎంతో మంది పేద స్టూడెంట్స్​ దూరంలో ఉన్న స్కూళ్లకు సక్కగా వెళ్లలేక మధ్యలోనే మానేస్తుండడం బాధాకరమన్నారు. సంస్థ సీఈఓ ప్రదీప్​ తో పాటు సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలోని చుంచుపల్లి మండలంతో పాటు మారుమూల ఏజెన్సీ గ్రామాల్లోని మొత్తం 200 మంది పేద స్టూడెంట్స్​ సైకిళ్లు​ పంపిణీ చేస్తోందన్నారు. తమ సంస్థ ప్రజలతో కలిసి పనిచేస్తూ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్​ డీకొండ దుష్యంత్​ కుమార్​, పుష్పరాజు, పెండకంట్ల హరికృష్ణ, హరీశ్, బాబూరావు, రవి రెగల్లా పాల్గొన్నారు.