ఎమ్మెల్సీల కేసులో తీర్పు రిజర్వు

ఎమ్మెల్సీల కేసులో తీర్పు రిజర్వు
  •      హైకోర్టులో ముగిసిన వాదనలు

హైదరాబాద్, వెలుగు: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం కేసులో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. గత ప్రభుత్వ కేబినెట్‌ దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని గవర్నర్​తమిళిసైకి సిఫార్సు చేయగా.. ఆమె తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో గవర్నర్​నిర్ణయాన్ని సవాల్​చేస్తూ వారిద్దరూ హైకోర్టులో వేసిన పిటిషన్​పై గురువారం చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌ కుమార్​ డివిజన్‌ బెంచ్‌ విచారణను పూర్తి చేసి.. జడ్జిమెంట్‌ను రిజర్వులో పెడుతున్నట్లు ప్రకటించింది. 

కుర్ర సత్యనారాయణ తరఫున సీనియర్​అడ్వొకేట్​మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేబినెట్‌ నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్‌ కు లేదని, కచ్చితంగా ఆమోదించితీరాలని చెప్పారు. అభ్యంతరాలుంటే పునఃసమీక్ష చేయాలని ఫైలును ప్రభుత్వానికి వెనక్కి పంపాలన్నారు. వ్యక్తిగతంగా గవర్నర్‌ నిర్ణయం తీసుకునేందుకు రాజ్యాంగంలో వెసులుబాటు లేదన్నారు. అందుకు విరుద్ధంగా గవర్నర్‌ చర్య ఉందని, ఈ చర్యపై న్యాయ సమీక్ష చేయవచ్చునని చెప్పారు.