ఆర్యన్ ఖాన్  జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

ఆర్యన్ ఖాన్  జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు కోర్టు డ్రగ్స్ కేసులో రిమాండ్ పొడిగించింది. ఆర్యన్ కు అక్టోబరు 30 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ముంబైలోని ఎన్డీపీఎస్ ప్రత్యేక  కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్యన్ ఈ నెల 3న డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. ఓ క్రూయిజ్ షిప్పులో జరుగుతున్న రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడకంపై సమాచారంతో పోలీసులు దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేశారు.  లేటెస్టుగా  ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించాడు.